24-05-2025 01:48:13 PM
నాగారం: దీర్ఘ కాలం పంట అయినా ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి నెల నెల ఆదాయం పొందాలని పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ(Patanjali Oil Palm Company) ఫీల్డ్ ఆఫీసర్ పి అశోక్ అన్నారు. శనివారం పనిగిరి గ్రామపంచాయతీ కార్యలయం ఆయిల్ పామ్ సాగు పైన రైతు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు.
ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు.ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం గా డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పారు. నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగాప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను వాణిజ్య పంటలను సాగు చెయ్యాలి