03-07-2025 02:10:02 AM
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
జగిత్యాల అర్బన్, జూలై 2 (విజయక్రాంతి): సీనియర్ సిటిజన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉన్నదని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఏళ్ళవేళలా సహకారిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించి, జగిత్యాల జిల్లా కేంద్రంలో సీని యర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి మరిన్ని సౌకర్యా లు కల్పిస్తామన్నారు. జిల్లాలో సీనియర్ సిటీజేన్స్ కేసులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సత్వరం పరిష్కరిస్తున్న జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, తదితర సంఘ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, నాయకులు హన్మంత రెడ్డి, విఠల్, యాకూబ్, శంకర్, సంజీవ రావు, ఇక్బాల్, శివానందం, బుచ్చిరెడ్డి, రాజేశ్వర్, సత్యనారాయణ, కరుణ ,విజయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.