03-07-2025 02:09:42 AM
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై ౨ (విజయక్రాంతి): నగరంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల విజ యలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం జోనల్, సర్కిల్ స్థాయి అధికారులతో కలిసి బంజారాహిల్స్ డివిజ న్ బంజారా లేక్‌లో ఉన్న గుర్రపు డెక్కతో పాటు ఇతర వ్యర్థాలను తొలగించే ప్రక్రియను మేయర్ పరిశీలిం చారు. ఏఎల్‌ఓ కార్యక్రమంలో భాగం గా ఎఫ్‌టిసి మిషన్‌తో పాటు డ్రోన్‌తో దోమల నివారణకు చేపట్టే పిచికారిని ఆమె ప్రారంభించారు.
వర్షాకాలంలో నగర వాసులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలతో పాటు ఏఎల్‌ఓ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆమెవెంట జోనల్ కమిషనర్ అనురాగ్ జ యంతి, డిప్యూటీ కమిషనర్ సమ్మ య్య, ఎంటమాలజీ ఈఈ విజయ్‌కుమార్ ఉన్నారు.