calender_icon.png 29 August, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2న ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వం చర్చలు

29-08-2025 05:44:34 AM

ఉద్యమ కార్యాచరణపై తేలేది ఆనాడే!

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాం తి): తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణపై ప్రభుత్వం స్పందించింది. ఈమేరకు గురువారం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావులను ఆహ్వానించి చర్చ లు జరిపింది. గురువారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఉన్నతా ధికారులతో పెండింగ్ సమస్యలపై వారు చర్చించారు.

సెప్టెంబర్ 2వ తేదీన జేఏసీ నేతలకు చర్చలకు ఆహ్వానించినట్లు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర, అక్టోబర్ 12న లక్ష మంది ఉద్యోగులతో భారీ సభను నిర్వహించనున్న ట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభు త్వం చర్చలకు పిలిచిన నేపథ్యంలో సెప్టెంబర్ 2నే ఉద్యమ కార్యాచరణ ఉంటుందా? లేక వాయిదా వేస్తారా అనేది తెలుస్తుంది.