calender_icon.png 29 August, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలి

29-08-2025 12:37:30 PM

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. శుక్రవారం కామారెడ్డి జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, విద్యానగర్, బతుకమ్మ కుంట, రాజా నగర్ కాలనీలను సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు.

కనీసం మంచినీళ్లు, టిఫిన్లు కూడా అందించడం లేదని బాధితులు జాన్ వెస్లీకి వివరించి తమ గోడును వెలబుచ్చారు. అధికారులు మాత్రం నిమ్మకు నీ రెత్తినట్లుగా  నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని బాధితులు వివరిం నట్లు తెలిపారు. జి ఆర్ కాలనీలోని బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, మహిళా సిపిఎం నాయకురాలు రేణుక, సిపిఎం నాయకులు కొత్త నర్సింలు, మోతిరామ్, ముధం అరుణ్, తదితరులు పాల్గొన్నారు.