29-08-2025 05:46:49 AM
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాం తి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సెప్టెంబర్ 1న నిర్వహించ తలపెట్టిన పాత పెన్షన్ సాధన పోరాట సభా వేదిక మారింది. తొలుత ఈ సభను నాంపల్లిలోని లలితా కళాతోరణంలో నిర్వహించాలని భావించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అక్కడ నిర్వహించేందుకు వీలుకాదని పోలీసు శాఖ తెలపడంతో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవనంలో నిర్వ హిస్తున్నట్లు టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వ ర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటలో తెలిపారు.