3 July, 2026 | 2:24 AM

సంగ లచ్చయ్యకు నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

03-07-2026 01:32 AM

వేములవాడ, జూలై 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగ స్వామి తండ్రి, 1వ వార్డు కౌన్సిలర్ సంగ హనుమవ్వ భర్త సంగ లచ్చయ్య ద్వాదశ దిన కర్మలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగ లచ్చయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.