calender_icon.png 18 July, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలం

18-07-2025 12:00:00 AM

ఆవునూరి మధు    

ఇల్లెందు, జులై 17,(విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫల మయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు. గురువారం ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాం రైతుల పడుతున్న ఇబ్బందులపై వ్యవసాయ అనుబంధ సంఘం డి.ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

రైతులకు యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇల్లెందు మండల పరిధిలో దాదాపు 34 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేస్తారని దానికి సరిపడా యూరియా అందించాలని, మండల పరిధిలో కొమరారం, చల్ల సముద్రంలో ఎరువుల గోడౌన్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎరువులను పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోతే రాష్ట్రంలో జరిగే మంత్రుల పర్యటన కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ప్రస్తుతం ఇల్లెందు పర్యటనకు వస్తున్న ఇద్దరు మంత్రులను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు మధు తెలిపారు. ఈ కార్యక్రమంలోన్యూడెమోక్రసీ అనుబంధ వ్యవసాయ సంఘం నాయకులు దుబ్బాకుల ప్రసాద్, ఎట్టి నరసింహారావు పాల్గొన్నారు.