25-08-2025 12:57:33 AM
-క్రైం కేసుల్లో వైద్యుల రిపోర్టే ప్రధాన ఆధారం
-జిల్లా న్యాయమూర్తి వీరయ్య
మంచిర్యాల, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందు కు వైద్యులు కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి వీరయ్య అన్నారు. ఆదివారం వైద్య వృత్తి, నైతిక విలువలు, చట్టపరమైన సమస్యలపై అవగాహన కల్పించడానికి జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ టాస్క్ ఫోర్స్, పీసీడీ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీని వాస్, ఐఎంఏ అధ్యక్షుడు పుజారి రమణలతో కలిసి మాట్లాడారు.
వైద్య వృత్తి చాలా గొప్పదని, ప్రజారోగ్య పరిరక్షణే వైద్యుల భాద్యత అని, అర్హత లేని ఆసుపత్రుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ మెడికల్ కౌనికల్ సభ్యులని అభినందించారు. హెఆర్డీఏ, ఐఎంఏ, ఓఎస్‌ఏఎం సం యుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్‌వోడీ డాక్టర్ హరీశ్‌రాజ్, ఐఎంఏ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ ద్వారకనాథ రెడ్డి, టీజీఎంసీ వైస్ చైర్మన్ జీ శ్రీనివాస్, ఐఎంఏ రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ వి అశోక్, హెచ్‌ఆర్డీఏ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ భ్రమేశ్వ ర్, రాష్ర్ట జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీత, వైద్యులు లక్ష్మీ నారాయణ, విశ్వేశ్వర్‌రావు, స్వరూప రాణి, ఓఎస్‌ఏఎం అధ్యక్షుడు డాక్ట ర్ ఉదయ్, సంతోష్, అనిల్, కిరణ్, నరేష్, తెలంగాణ మెడికల్ టాస్క్ ఫోర్స్ అసోసియేట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.