20-12-2025 01:02:01 AM
బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పట్టోల్ల కార్తీక్ రెడ్డి
శంషాబాద్ డిసెంబర్ 19, (విజయ క్రాంతి ): శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని బి ఆర్ ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి పట్టొల్ల కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. శంషాబాద్ ను చార్మినార్ జోన్ లో కలిపే యోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. శుక్రవారం శంషాబాద్ ను ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నాయకులు తలపెట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పరిపాలన సౌలభ్యం కోసం జిహెచ్‌ఎంసి పరిధిని విస్తరించడం సరైనదే. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలను జిహెచ్‌ఎంసి పరిధిలోకి తెచ్చే క్రమంలో స్థానిక పరిస్థితులు, ప్రాంతాలు, ప్రజల అభిప్రాయాలను తీసుకొని జోన్లు, డివిజన్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. సంతకాలు సేకరణ అనంతరం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.