19-10-2025 12:00:00 AM
పట్టాలు అందుకున్న 170 మంది ఎంబీఏ విద్యార్థులు
హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): హైదరాబాద్ నగర శివారులోని చిలూకూరులో ఉన్న అరిస్టాటిల్ పీజీ కాలేజీలో ఘనంగా 21వ పట్టభద్రుల వేడుక నిర్వహించారు. 2025 బ్యాచ్‌కి చెందిన 170 మంది ఎంబీఏ విద్యార్థులు తమ పట్టాలను అందుకున్నారు. ఈ వేడుక గర్వం, విజయోత్సాహం మరియు ప్రేరణతో నిండిపో యింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డా. ఎల్. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఆయన విద్యార్థులను అభినందిస్తూ చదువు జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని అన్నా రు. విద్యార్థులు నిబద్ధతతో, సామాజిక సేవాభావంతో, మరియు కళాశాల ప్రతిష్ఠను నిలబెట్టే విధంగా ప్రవర్తించాలని ఆయన ప్రోత్సహించారు.ప్రధాన అతిథి యూజీసీ జాయింట్ సెక్రటరీ(న్యూఢిల్లీ) గోపిచంద్ మేరుగు తన ప్రసంగంలో మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ పరిశ్రమల మరియు జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
లయన్స్ క్లబ్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన బాబురావు ఘాట్లమ నేని విద్యార్థులను స్ఫూర్తి ప్రదానం చేస్తూ, మీరు దేశ భవిష్యత్తు అని అభివర్ణించారు. కాగా ఈ సంవత్సరం కళాశాల 98% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది. ఎస్. కావ్య, కె. అర్చన మొదటి రెండు స్థానాలు సాధించి నగదు బహుమతులు అందుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ విద్యార్థులతో అకాడెమిక్ మరియు ప్రొఫెషనల్ విలువలను పాటించేందుకు ప్రతిజ్ఞ చేయించారు.