19-10-2025 07:33:34 PM
గజ్వేల్ పద్మశాలి సంఘం ఎన్నికలు..
అధ్యక్షుడిగా ఎన్నికైన బొల్లిబొత్తుల దేవదాసు..
వారం రోజులుగా గజ్వేల్ లో ఉత్కంఠంగా కొనసాగిన ఎన్నికలు..
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలో వారం రోజులుగా ఉత్కంఠతను కలిగించిన పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ప్రతిష్టాత్మకంగా జరిగిన పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా బొల్లిబొత్తుల దేవదాస్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కోట కిషోర్, ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి ఎల్లంరాజు, కోశాధికారిగా హనుమాన్ దాస్, జాయింట్ సెక్రటరీగా పాశుకంటి శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన న్యాయవాది తలకొక్కుల రాజు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
అనంతరం గజ్వేల్ పట్టణంలో విజేతలు ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను తలపించే విధంగా పద్మశాలి సంఘం ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ప్రచారం ప్రజల్లో ఎంతో ఉత్కంఠతకు గురిచేసింది. కుల సంఘాల నాయకత్వంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటారని ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికలలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి గెలిచిన ప్యానల్ విజయానికి అండగా నిలబడడమే కారణంగా చెప్పుకోవడం కనిపించింది. విజయోత్సవ సంబరాల్లోనూ భాస్కర్ కు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం దీన్ని బలపరుస్తుంది.