19-10-2025 07:56:43 PM
నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్(సిఐటియు) నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కట్టంగూరు మండలం చెర్వుఅనారం గ్రామానికి చెందిన పోన్న అంజయ్య ఎంపికయ్యారు. ఆదివారం కనగల్ మండల కేంద్రంలో శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆ సంఘం నల్గొండ జిల్లా 7వ మహాసభలో ఆయనను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.