calender_icon.png 19 October, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం..

19-10-2025 07:37:15 PM

చిట్యాల (విజయక్రాంతి): అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం ఆదివారం తడిసి ముద్దయింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి, వెలిమినేడు, గుండ్రంపల్లి గ్రామాలలో అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోయింది. కష్టపడి పండించిన ధాన్యం తడవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎటు చేసేది లేక రైతులు తమ ధాన్యాన్ని నీటి నుండి వేరు చేసుకుని ఆరపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయా గ్రామల రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.