19-10-2025 08:00:52 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నారులు పెద్దల పర్యవేక్షణలో ఉండాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఈ దీపావళి వెలుగులు ప్రతి ఇంటికి సంతోషం, ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని విద్యుత్ కాంతి వెలుగులతో తీర్చిదిద్దారు.