03-05-2025 02:27:27 AM
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): హైదరాబాద్ షేక్‌పేటలోని జి నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(జీఎన్‌ఐటీఎస్) కాలేజీలో నాలుగవ గ్రాడ్యుయేషన్ డేను నాల్గవసారి విజయవంతంగా నిర్వహించారు. క్యాంపస్‌లోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా ఎంట ర్‌ప్రైజెస్ హెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ కడియాల, గౌరవ అతిథిగా టీజీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్, సెక్యూరిటీ జాయింట్ డైరెక్టర్ సీ నర్మద హాజరయ్యారు.
జీఎన్‌ఐటీఎస్ చైర్మన్ జీ రాఘవరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ జి శ్రీవిద్యరెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు గోపా ల్‌రెడ్డి, మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, బీహార్ మాజీ ప్రో వీసీ, యూజీసీ మాజీ సభ్యుడు పాల్గొన్నారు. కిరణ్మయి పెండ్యాల కార్పొరేట్ వీపీ, హెచ్‌ఆర్, యూపీఎస్ ఇండియా టెక్నాలజీ సెంటర్, ప్రిన్సి పాల్ డాక్టర్ కె. రమేష్‌రెడ్డి, డీన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. 1,050 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.