03-05-2025 02:25:06 AM
బధిరుల పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): హైదరాబాద్ రామకృష్ణాపురంలోని హెలెన్ కెల్లర్స్ బదిరుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించారు. విద్యార్థుల ప్రావీణ్యతను అభినందిస్తూ శుక్రవారం సంస్థ స్థాపకుడు పఠాన్ ఉమర్‌ఖాన్ విద్యార్థులందరినీ సత్కరించారు. 22 మంది విద్యార్థులు బధిరుల కావడంతో వారికి కేవలం నాలుగు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని, సింగల్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుందని, ఒక లాంగ్వేజ్‌తో సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథమెటిక్స్ మాత్ర మే పరీక్ష రాస్తారని చెప్పారు.
ఈ పరీక్షలు దివ్యాంగులుకాని విద్యార్థులతో కలిపి సమానమైనటువంటి పరీక్ష రాయడం అందులో మంచి మార్కులను సాధించి ఆత్మ విశ్వాసాన్ని చాటి చెప్పారని పేర్కొన్నారు. వీరిలో ఎడమ అనూష 72.3శాతంతో మొదటి స్థానంలో, ఇరాటి జస్వంత్ 71శాతంతో రెండో స్థానంలో, మనిషా వెంకటేష్ 70శాతంతో మూడో స్థానాన్ని సాధించారు.
ఇదే విధంగా ఇంటర్ ఫలితాల్లో 70 మందిలో 65 మంది బధిర విద్యార్థులు ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉన్నదని హెలెన్ కలర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు పఠాన్ ఉమర్‌ఖాన్ తెలిపారు. ఉపాధ్యాయులు బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.