calender_icon.png 4 May, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణతో విధులను నిర్వహించాలి: జిల్లా ఎస్పీ

03-05-2025 04:16:47 PM

వయసు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగ సాధన...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): సిబ్బంది విధులను నిర్వర్తించే క్రమంలో క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) సూచించారు. ప్రతి శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిబ్బంది ప్రతి ఒక్కరికి పరేడ్ నిర్వహించబడుతుందని, పరేడ్ వల్ల సిబ్బంది ఒకరి మధ్య ఒకరికి మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని, అదేవిధంగా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలని తెలిపారు. ముందుగా ఏడు ప్లాటూన్ లతో కూడిన పరేడ్ లో విడతలవారీగా ప్రత్యేక గౌరవ వందన సమర్పించారు. 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా పరేడ్ కు బదులు యోగ శిక్షణను అందించారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... పరేడ్ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తూ, సిబ్బంది విధులలో చెడు వ్యసనాలను అలవాటు పడవద్దని సూచించారు. పోలీసు వ్యవస్థకు క్రమశిక్షణ తప్పనిసరిని క్రమశిక్షణ ఉల్లంఘన జరిగితే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. తెలియని వ్యక్తులకు పూచికత్తులు (షూరిటీ) ఇవ్వద్దన్నారు. పరేడ్లో భాగంగా సిబ్బంది అందరికీ ఆయుధాలపై, వాటి వినియోగంపై, ట్రాఫిక్ సిబ్బందికి సిగ్నల్స్ పై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ లు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్, ఫణిధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, శ్రీపాల్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.