calender_icon.png 3 May, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔదార్యం చాటుకున్న ‘ఐడీబీఐ’

03-05-2025 02:29:47 AM

సీసీ ష్రాఫ్ మెమోరియల్ హాస్పిటల్‌కు రూ.20 లక్షల మెడికల్ యూనిట్

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ ఫరూఖ్ నగర్ బ్రాంచీ సీఎస్‌ఆర్ నిధులతో సీసీ ష్రాఫ్ మెమోరియల్ హాస్పిటల్(నందిని రమేష్ గాంధీ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ యొక్క యూ నిట్)కు అండగా నిలిచింది. రూ.20 లక్షల విలువైన ‘అల్ట్రా సౌండ్ మెషిన్‘ను శుక్రవా రం విరాళంగా అందజేసింది. అల్ట్రా సౌండ్ సిస్టమ్‌తో రోగ నిర్ధారణ, వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రిపై ఆధారపడే పేద, అవసరమైన రోగులకు గణనీయంగా ప్రయోజనం చేకూనుంది.

1976లో స్థాపించబడిన మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి, లాభాపేక్షలేని సంస్థ అయిన సీపీ ష్రాఫ్ మెమోరియల్ హాస్పిటల్ సమాజానికి నాణ్యమైన, సరసమైన వైద్య సంరక్షణను అందించడంలో ముందంజలో ఉంది. ఈ ఆసుపత్రిలో ఈసీఐఎల్, ఎన్‌ఎఫ్‌సీ, మిధాని, ఎన్‌ఐఎన్, బీడీఎల్, ఎన్‌ఆ ర్‌ఎస్‌ఏ వంటి వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు చికిత్స అందిస్తారు.

కాగా ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జోన్ సీజీఎం, జోనల్ హెడ్ ఎం జానికిరామన్ అధ్యక్షత వహించారు. హైదరాబాద్-2 రీజియన్ డీజీఎం, ఆర్‌హెచ్ వెంకటేష్ దీవనపల్లి, హైదరాబాద్-1 రీజియన్ జీఎం, సీనియర్ ఆర్‌హెచ్ సందీప్ పట్నాయక్, ఫరూఖ్ నగర్ బ్రాంచ్ ఏజీఎం, బ్రాంచ్ హెడ్ కవిత వి, హైదరాబాద్-2 రీజియన్ ఏజీఎం, రీజినల్ కో-ఆర్డినేటర్ నరేన్ కందుల హాజరయ్యారు.