03-05-2025 03:39:45 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Of Coal Mines Kishan Reddy) పేర్కొన్నారు. రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైనదని, పదేళ్లుగా జాతీయ రహదారులను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. వాజ్ పేయీ హయంలో స్వర్ణ చతుర్భుజి పథకాన్ని తెచ్చారని, రోడ్ల నిర్మాణంపై లక్షల కోట్లు ఖర్చు ఎందుకని అనాడు విమర్శించారు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, మోదీ సర్కార్ ఏర్పాడిన తర్వాత రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని కిషన్ తెలిపారు. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల నుంచి జాతీయ రహదారులు వెళ్తున్నాయని, కనెక్టివిటీ కోసం కేంద్రం ఎక్కువ నిధులు ఖర్చు పెడ్డుతోందని వివరించారు. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారి పదేళ్ల తర్వాత 5200 కిలోమీటర్ల ఏర్పాడిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రింగ్ రోడ్డుల అభివృద్ధి జరుగుతోందని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.