03-05-2025 04:23:40 PM
- నాణ్యమైన విద్యుత్తు అందించేందుకే నూతన సబ్ స్టేషన్ నిర్మాణం
- మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి...
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మనిషి మనుగడకు జీవధారమైన రైతన్నకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ గ్రామంలో నూతన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడం తో పాటు, లో ఓల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ ను నిరంతరం అందించేందుకు కృషి చేస్తామనిస్పష్టం చేశారు. ఈ యొక్క విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వలన విద్యుత్ సరఫరాలో అంతరాయం, విద్యుత్ కోతలు, లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా ఈ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలకు మేలు జరుగుతుంది అని ఆయన తెలిపారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండేందుకే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి 25 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తి చేశామని ఆయన గుర్తు చేశారు. మన్యంకొండ దేవాలయ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, దినదినాభివృద్ధి చెందుతున్న మన్యంకొండ దేవాలయ అభివృద్ధి చేయుటకు రూ. 130 కోట్లలతో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తునే ఉందని, అందులో భాగంగా గృహ జ్యోతి ద్వారా ప్రతి పేదింటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లుతో పాటు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
అంతకుముందు మహబూబ్ నగర్ మండలం లోని రైతులు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఎడ్ల బండి పైన వేదిక వరకు గ్రంథాలయ సంస్థ చైర్మన్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ రైతులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఎస్ఈ పివి రమేష్, డిఇ (ఆపరేషన్) లక్ష్మణ్, తహసీల్దార్ సుందర్ రావు, నాయకులు మల్లు అనిల్ రెడ్డి, అనిల్, సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, ఎన్ బాలయ్య, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, కె.మహేందర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, పులిజాల రవికిరణ్, కురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.