మే 2న పట్టభద్రుల ఎన్నిక నోటిఫికేషన్

27-04-2024 02:56:16 AM

9 వరకు నామినేషన్ల స్వీకరణ

నల్లగొండ, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): వరంగల్  పట్టభద్రుల  ఎన్నికకు నోటిఫికేషన్  మే 2న వెలువ డుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. మే 27న ఎన్నికల నిర్వహిస్తారని పేర్కొన్నారు. పట్టభ ద్రుల ఎన్నిక నిర్వహణపై అధికారులు, వివి ధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవా రం ఆమె సమావేశం అయ్యారు. మే 2 న నోటిఫికేషన్, 2 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ, మే 10న నామినేషన్ల పరిశీలన, మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉం టుందని వివరించారు. ఎన్నిక మే 27న ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4  గంటల వరకు నిర్వహిస్తారని, జూన్ 5న కౌంటింగ్, జూన్ 8న పట్టభద్రుల ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.

12 జిల్లాల్లో పట్టభద్రుల  ఎన్నికలకు సంబం ధించి 37 మంది ఏఆర్వోలు విధులు నిర్వ హించనున్నట్టు తెలిపారు. నల్లగొండ, వరం గల్, ఖమ్మం  ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,91,396 మంది ఓటర్లు ఉన్నారని, 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 1,400 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉంటే అదనంగా మరో పోలింగ్ కేంద్రం కోసం ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఎన్ని కల సాధారణ పరిశీలకులు మనోజ్‌కుమార్ మాణిక్ రావు, సూర్యవంశీ, వ్యయ పరిశీల కులు కల్యాణ్‌కుమార్ దాస్, పోలీస్ పరిశీల కులు అయోఘ జీవన్‌గాంకర్, అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, ప్రత్యేక కలెక్టర్ నటరాజ్ , రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.