8 April, 2026 | 4:44 AM

నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి

07-05-2024 01:24 AM

మంచిర్యాల, మే 6 (విజయక్రాంతి): రైతుల నుంచి తాలు, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన ధాన్యాన్నికొనుగోలు చేయాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్  కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన తనిఖీ చేసి సెంటర్ ఇన్‌చార్జ్‌లకు, రైతులకు పలు సూచనలు చేశారు. కాంటా కాగానే ధాన్యాన్ని మిల్లుకు పంపించాలని, జిల్లాలో 19 బాయిల్డ్ మిల్లులు మాత్రమే ఉండటంతో, రైతులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లాకు ట్యాగింగ్ ఇచ్చినట్లు తెలిపారు.  ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే తూకం వేయించాలని ఆయన వారికి సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 7009 మంది రైతుల నుంచి 50,373 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.38.41 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశామని వెల్లడించారు.