22 April, 2026 | 1:35 AM

బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

22-04-2026 12:00 AM

కొండపాక, ఏప్రిల్ 21: కొండపాక మండలం బందారం నుంచి దర్గా వరకు బీటీ రోడ్డు పనులను మంగళవారం ప్రారంభించిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి. ఈ సందర్భంగా ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి చోరువతో మంత్రి సీతక్క అనుమతితో మూడు కిలోమీటర్ల రోడ్డుకు నిధులు మంజూరు చేశారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు.

ప్రభుత్వం బందారం నుంచి దర్గా గ్రామం వరకు రూ 3కోట్ల 20 లక్షలు మంజూరు చేసింది. బీటీ రోడ్డుకు శంకుస్థాపన  చేసి పనులను ప్రారంభించారు. రోడ్డు పనులు జరుగుతుండడంతో రెండు గ్రామల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసరి లింగారావు, బంగారం గ్రామ సర్పంచ్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.