8 May, 2026 | 1:03 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

08-05-2026 12:00 AM

సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 7: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో పోసి నెల రోజులు దాటినప్పటికీ నేటికీ కొనుగోల్లు వేగవంతం చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే కాంటాలు జరిపి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఎం పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని,జాప్యం లేకుండా కొనుగోల్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్రంలోని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి, పులుసు సత్యం, వజ్జె శ్రీనివాస్, ఎల్లెంల అవిలయ్య, దేవులపల్లి వీరారెడ్డి, బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్ రెడ్డి, కొప్పోజు సరోజ తదితరులు పాల్గొన్నారు.