calender_icon.png 11 November, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ

11-11-2025 12:13:02 AM

సురక్షితంగా బయటపడిన విద్యార్థులు

చిట్యాల, నవంబర్ 10(విజయ క్రాంతి):  రోడ్డు ప్రమాదంలో స్కూల్ బస్సును లారీ ఢీకొనగా, పెను ప్రమాదం నుండి విద్యార్థులు సురక్షితంగా బయటపడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  నార్కట్ పల్లి కి చెందిన శ్రీ విద్యా పీట్  కు సంబందించిన  స్కూల్ బస్సు నార్కట్ పల్లి నుండి ఏపీ లింగోటం  గ్రామానికి వెళ్లి విద్యార్థులను తీసుకు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

స్కూల్ బస్సును వెనుక నుండి  లారీ ఢీ కొట్టగా  పెను ప్రమాదం తప్పి ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి.  స్కూల్ బస్సు యూ టర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొనడంతో అదుపుతప్పి లారీ  బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉండగా లారీ ఉల్లిగడ్డ లోడుతో రోడ్డు పక్కన పడిపోగా అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకొని వెళ్లిన  ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రజలు, వాహనదారులు ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్తుండగా పోలీసులు వచ్చి నిలువరించారు.