calender_icon.png 3 November, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగస్థల సేవా సామ్రాట్ అవార్డు అందుకున్న పిచ్చయ్య

02-11-2025 06:08:36 PM

మఠంపల్లి: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విజేత కళాపూర్ణ నటశ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్యను వరించిన రంగస్థల సేవా సామ్రాట్ అవార్డ్. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నాంపల్లి హైదరాబాద్ నందు విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు కళావేదికలు విశ్వజనని ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా అంగరంగ వైభవంగా నృత్య ప్రదర్శనలు సంగీత విభావరితో అలరించిన కార్యక్రమంలో మిమిక్రీ సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా మఠంపల్లి మండలం కేంద్రానికి చెందిన కళా ప్రపూర్ణ నట శ్రీ డాక్టర్ గుంటి పిచ్చయ్య ఎన్టీఆర్ వాక్చాతుర్యాన్ని తన స్వరంలో వినిపించి సభా వేదికను ఉర్రూతలూగించారు.

చాణక్యుని ఏకపాత్రాభినయంలో జన రంజకం చేశారు. శ్రీకృష్ణదేవరాయల గెటప్ లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి అతిథుల చేత శభాష్ అనిపించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గుంటి పిచ్చయ్య  మాటలతో, వేషధారణతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా డాక్టర్ గుంటి పిచ్చయ్యని కళా రంగ విశిష్ట సేవలను గుర్తించి అభినయ శిల్పి రంగస్థల సేవ సామ్రాట్ బిరుదులతో పాటుగా ప్రశంస పత్రం సీల్డ్, గోల్డ్ మెడల్ తో ప్రముఖుల సినీ నటులు గౌతమరాజు, టీవీ ఫిల్మ్ కళాకారులు శ్రీనివాస గుప్తా ఘనంగా సత్కరించారు.