calender_icon.png 26 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

26-11-2025 09:37:25 PM

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని.. 

గద్వాల: 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి అదనపు డిజిపి మహేష్ భగవత్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు -కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

రిజర్వేషన్లు, విడతల వివరాలు పోలింగ్ కేంద్రాలు, జియో లోకేషన్, టి ఈ పోల్ పోర్టల్ లో నమోదు చేయాలని, పోర్టల్ లో గ్రీవెన్స్ ఫ్లాట్ ఫామ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారానికి నోడల్ అధికారిని నియమించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా తెలుపబడిన ఫిర్యాదులను 3 రోజులలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘనకు గురైనట్లయితే ఫిర్యాదులను స్వీకరించి త్వరగా పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లను కౌంటింగ్ కు 3 రోజుల ముందుగా సిద్ధం చేయాలని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

అదనపు డి జి పి మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నగదు సీజ్ చేసే సమయంలో అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సీజ్ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో 2వ సాధారణ పంచాయితీ ఎన్నికలను మూడు విడతలలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేయలెన్స్ బృందాలు, మీడియా సెల్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.