26-11-2025 08:55:51 PM
ఎమ్మెల్యేకు గ్రామ శాఖ అధ్యక్షుడు లతీఫ్ వినతి..
కోదాడ: యర్రవరం గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం తనకు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లతీఫ్ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని బుధవారం విజ్ఞప్తి చేశారు. గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్నానని, గ్రామ ప్రజల నమ్మకం తనపై బలంగా ఉందని లతీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల్లో తనకు మంచి గుర్తింపు, అన్ని వర్గాల ఆదరణ ఉన్నదని, పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే మరింత బలపడతానని తెలిపారు. మైనార్టీ అభ్యర్థికి సర్పంచ్ అవకాశం ఇవ్వడం వల్ల మండల వ్యాప్తంగా పార్టీకి మంచి పేరు వస్తుందని, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయావకాశాలు పెరుగుతాయని లతీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.