calender_icon.png 26 November, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి

26-11-2025 08:54:23 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం ఐడిఒసి కార్యాలయం సమావేశ మందిరంలో విద్య, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, పంచాయతీ, తపాలా, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 5 సంవత్సరాలలోపు గల పిల్లలందరి ఆధార్ నమోదు చేయించాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయాలని, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటినవారు ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాలని తెలిపారు. 

ఆధార్ లేని వారిని గుర్తించి నమోదు చేయించాలని తెలిపారు. జిల్లాలో మొత్తం ఆధార్ కార్డుల సంఖ్య 10,57,427 అని మిగిలిన వారిని అందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెలలో మొదటి వారంలో ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఆధార్ కార్డు లేని పిల్లల వివరాలను నివేదికలు తయారు చేయాలన్నారు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఆధార్ కార్డు లేని పిల్లల వివరాలను సేకరించి నివేదికలు అందించాలని ఆదేశించారు వచ్చే మార్చి నాటికి జిల్లా వ్యాప్తంగా అందరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మార్చి ఒకటవ తేదీ వరకు బయోమెట్రిక్ సవరణల ను ఖచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అనంతరం అవసరమైన చోట ఆధార్ క్యాంపులను నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కొంతమందికి రెండు ఆధార్ కార్డులు మంజూరు అయ్యాయని దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని ఆ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, డిప్యూటీ కలెక్టర్ మురళి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఈడియం సైదేశ్వర రావు,సంభంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.