26-11-2025 09:07:35 PM
టేకులపల్లి (విజయక్రాంతి): మత్తు పదార్థాలను కనిపెట్టేందుకు జాగిలాలతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఇల్లందు డిఎస్పి ఎన్. చంద్ర భాను ఆదేశాల మేరకు గంజాయి, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ ను కనిపెట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో టేకులపల్లి మండలంలోని పాత గంజాయి నేరస్తుల ఇళ్లల్లో, నిర్మాణుష్య ప్రదేశాలలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, జాగిలంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలోని పలుచోట్ల టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో గంజాయిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.