ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు,వార్డు సభలు
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్
జగిత్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు/వార్డుసభలు ని ర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రాం తాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పో లింగ్ కేంద్రాల్లో వార్డుసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సభల్లో సంబంధిత బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల పాఠశాల సభ్యులు పా ల్గొంటారని తెలిపారు. జిల్లాలోని అర్హులైన పౌరులు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండనున్న యువత ఈ గ్రామసభలు/వార్డుసభలకు హాజరై తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణ లేదా అభ్యంతరాలకు సంబంధించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






