లాల్‌బజార్‌లో ఘనంగా బోనాల జాతర
07-08-2026 02:32 AM
సికింద్రాబాద్,ఆగస్టు 6 (విజయక్రాంతి): తిరుమలగిరి లాల్ బజార్ బోనాల జాతర సందర్భంగా మాజీచైర్మన్‌లు గజ్జెల నాగేష్, టి.ఎన్. శ్రీనివాస్‌తో కలిసి మహంకాళి అ మ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిం చి, ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆయు రారోగ్యాలు,సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సత్యనారాయణ గౌడ్ , కె.పి. శంకర్, జంగిలి రాజు, రావుల సతీష్,మార్కెట్ మాజీ సభ్యుడు దేవులపల్లి శ్రీనివాస్,శేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.






