వైభవంగా వరలక్ష్మీ వ్రత మహోత్సవం
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నిర్వహణ
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 21 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదా న్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత పూజా మ హోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రత పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ వ్రతం అంటే కేవలం పూజా కార్యక్రమం మాత్రమే కాకుండా నియమబద్ధమైన జీవనం, క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన ఆచరణకు ప్రతీక అని తెలిపారు.
అలాగే విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదల ఎంతో ముఖ్యమని, చదువుతో పాటు ప్రతి బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలపై స్పష్టమైన దృష్టితో ముందుకు సాగాలని, ఏ పని చేసినా ఆసక్తి, శ్రద్ధతో చేస్తేనే మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు. అమ్మవారు ఆహ్లాదం, ఉత్సా హం, ప్రసన్నతకు ప్రతీక అని పేర్కొంటూ.. జీవితంలో సానుకూల దృక్పథంతో ముం దుకు సాగడం ద్వారా విజయాన్ని సాధించవచ్చన్నారు.
జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా విద్యాలక్ష్మిని, విజయాన్ని సాధించడం ద్వారా జయలక్ష్మిని ఆరాధించినట్లవు తుందని విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో వివిధ పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తొ లుత విఘ్నేశ్వర పూజ నిర్వహించిన అనంతరం వరలక్ష్మీ వ్రత పూజ కొనసాగింది. వి ద్యార్థినులు ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.






