2 July, 2026 | 3:28 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •  

ఘనంగా విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం

18-09-2025 12:45 AM

 పాల్గొన్న శాసన మండల చైర్మన్, గుత్తా సుఖేందర్ రెడ్డి 

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వ శిల్పిగా, దేవ శిల్పిగా మహానగరాలను సృష్టించిన మహోన్నత కర్తగా ఆరాధించబడుతున్న శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ గారి యజ్ఞ మహోత్సవం ( జయంతి ) వేడుకలను బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, బీసీ వెల్ఫేర్ అధికారి సాహితి,విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు, చిత్రం పటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.