calender_icon.png 23 October, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా స్వేరోస్ ఆవిర్భావ వేడుకలు

23-10-2025 12:13:32 AM

ముషీరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): స్వేరోస్ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్వేరోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తిమ్మన వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ముషీరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరోస్ జెండా ఆవిష్కరించి గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు దివంగత కలెక్టర్ ఎస్.ఆర్ శంకరన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ  బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎస్.ఆర్ శంకర్ సామాజిక స్పృహతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి నిరక్షరాస్యత నిర్మూలనకు కృషిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వసంత, అధికార ప్రతినిధి వంశీ, నాయకులు అనిల్, ఆజాద్, దాసు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.