calender_icon.png 23 October, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్ బ్యాంకుకు 40 నామినేషన్లు దాఖలు

23-10-2025 12:13:58 AM

నేడు చివరిరోజు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం

కరీంనగర్, అక్టోబరు 22 (విజయ క్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాం కుకు నవంబర్ 1న జరగనున్న ఎన్నికలకు పోటీ చేసేందుకు బుధవారం 12 డైరెక్టర్ స్థా నాలకు 40 నామినేషన్లు దాఖలైనాయి. నా మినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, శనివారం నామినేషన్ల ఉపసంహరణ ఉం టుంది. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్నా యి. పోటాపోటీ బ్యానర్ల ఏర్పాటులో నేతలు పోటిపడి నామినేషన్లు దాఖలు చేశారు.

పా ర్టీ గుర్తుపై కాకున్నా పార్టీ ప్యానెల్ పేరుతో బ రిలో నిలిచేందుకు ఉత్సాహ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారే బుధవారం ఎ క్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశా రు. జనరల్ కేటగిరీలో ముప్పిడి సునీల్ కు మార్, మహ్మద్ షమీయుద్దీన్, పంజర్ల రేణు క, బండి ప్రశాంత్ దీపక్, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, తాడ వీరారెడ్డి, మహ్మద్ కలీంఖా న్, మహ్మద్ బబ్లూ, కే శ్రీనివాస్ వరప్రసాద్, గడ్డం విలాస్ రెడ్డి, సయ్యద్ ముజీబ్ హు స్సేన్, ఎలగందుల మునీందర్, ఇ లక్ష్మణ్ రా జు, వొడ్నాల రాజు, కర్ర రాజశేఖర్, బొమ్మరాతి రాధాకృష్ణ, బాశెట్టి కిషన్, నాగుల స తీష్, నార్ల శ్రీనివాస్, దేశ వేదాద్రి, ధరణికో ట దామోదర్, మూల వెంకటరవీందర్ రెడ్డి, గుండ కిషన్, కైలాస నవీన్, ఉయ్యాల ఆనం దం, అనరాసు కుమార్, రవీందర్, లక్కిరెడ్డి కిరణ్ కుమార్, పూసరి అనిల్ కుమార్ లు నామినేషన్లు దాఖలు చేశారు. మహిళా కో టా కింద ముద్దసాని శ్వేత, పంజర్ల రేణుక, మూల లక్ష్మిలు నామినేషన్లు దాఖలు చేశా రు. ఎస్సీ, ఎస్టీ కోటా కింద లింగంపల్లి సత్యనారాయణ, అలుగు విద్యాసాగర్, సరిల్ల రత న్రాజ్, బత్తుల రాజ్కుమార్, లింగంపల్లి శ్రీనివాస్ లు నామినేషన్లు దాఖలు చేశారు.

గత పాలకవర్గంలో చైర్మన్ గా ఉన్న కర్ర రాజశేఖర్ తన ప్యానెల్ ను సిద్ధం చేసుకుంటున్నా రు. 12 మంది డైరెక్టర్లలో ఇద్దరు మహిళలు, ఎస్సీ, ఎస్టీల నుండి ఒకరిని, మిగతా 9 మం దిని జనరల్ కేటగిరి నుంచి ప్యానెల్ రూ పొందించే పనిలో పడ్డారు. ఆయనతోపాటు మరో మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ప్యానె ల్ రూపొందించే పనిలో ఉన్నారు. బీజేపీ కూడా అభ్యర్థులను బరిలో దించే అవకాశం ఉండడంతో ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థికి కరీంనగర్ మాజీ మేయర్ డి శంకర్ ను బరిలో దించే అవకాశం ఉంది. ఇతను కూడా గతం లో అర్బన్ బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు.