వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
రూ.లక్ష విరాళమిచ్చిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
ఆమనగల్, జూన్ 29(విజయక్రాంతి): ఆమనగల్ మండలం కోనాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్స వం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నా యకులు, టాస్క్ సీ .ఓ .ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు.
ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయ న తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ దేవా లయాలు ఆధ్యాత్మికతకు, సామాజిక ఐక్యత కు ప్రతీకలని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురా రోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అభివృ ద్ధి కోసం రూ. లక్ష విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.






