పల్స్ పోలియో ఇంటింటి సర్వే
మహబూబాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటింటి సర్వే కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 938 బృందాలు ఇంటింటికీ వెళ్లి 5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించి, పోలియో చుక్కలు వేయని పిల్లలకు టీకా అందించాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 2,456 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ కంబాలపల్లి గ్రామంలో స్వయంగా ఇంటింటి సర్వేను పరిశీలించారు.
ప్రతి ఇంటికి వెళ్లి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందాయా లేదా అని ధృవీకరించి, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా పోలియో చుక్కలు వేయాలని ఫీల్ సిబ్బందికి సూచించారు. దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శివకుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ. పురుషోత్తం, ఎంపీహెచ్‌ఈఓ కె.ఎల్.ఎన్. స్వామి, సబ్ యూనిట్ ఆఫీసర్ వి. శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ పి. లింగారెడ్డి, అనిల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






