17 August, 2026 | 5:58 PM

ఉపాధ్యాయ నేతకు ఘన సన్మానం

17-08-2026 04:54 PM

వాంకిడి, (విజయక్రాంతి): పీఆర్టీయూటీఎస్ వాంకిడి మండల అధ్యక్షుడిగా 11వసారి ఎన్నికైన ఉపాధ్యాయుడు ఉప్రే వినీష్‌ను భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో సోమవారం జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ.. 2006 నుంచి 20 ఏళ్లుగా ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడిగా కొనసాగడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ వినీష్ చురుగ్గా పాల్గొంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో దుర్గం దుర్గాజీ, లహిజి శ్యామ్రావు దుర్గే, రాజేశ్వర్ ఉప్రే, ప్రకాష్ ఉప్రే, నూతన్, జైపాల్, రమేష్ జాడే, వివేక్ తదితరులు పాల్గొన్నారు.