మెరిట్ విద్యార్థులకు డాక్టర్ మాగంటి ప్రభాకర్ రావు చేయూత
17-08-2026 05:32 PM
కల్లూరు, ఆగస్టు 17 (విజయక్రాంతి): చండ్రుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు డాక్టర్ మాగంటి ప్రభాకర్‌రావు సోమవారం నగదు ప్రోత్సాహకాలు అందించారు.
రామిశెట్టి సాయి వెన్నెల 571, ఎస్.కె. నసీమా 551, పవన్‌సాయి 540 మార్కులు సాధించగా.. వారికి వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రభాకర్‌రావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






