calender_icon.png 14 May, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా వీల్‌చైర్ల పంపిణీ

14-05-2025 12:00:00 AM

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థులకు ఉచితంగా వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పి.రాజనర్సింహారెడ్డి  మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి , షార్ ప్రాజెక్ట్ వారి ఆర్థిక సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ నార్త్ , రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ వారి సంయుక్త సౌజన్యంతో 50 వేల రూపాయల విలువ కలిగిన 5 వీల్ చైర్స్ ను దివ్యాంగ విద్యార్థులకు పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రాజ నరసింహారెడ్డి, డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్, ట్రెజరర్ కృష్ణ హరి, రొటీరియన్స్ సుభాష్ చంద్ జైన్, కాశీనాథం, ధనంజయ, బాలరాజ్, నాగభూషణం, శంకర్ , సుధాకర్ రావు, వెంకటరమణ, నవీన్ మరియు లబ్ధిదారులు సమత, సాయిలు శెట్టిపల్లి సంగారెడ్డి, కాశీరాం కోర్పూల్ గ్రామం, మనోజ్ మోతే గ్రామం, ఆసిఫ్ ధర్మరావుపేట దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు.