టీజీ20 లీగ్ షురూ
అట్టహాసంగా ఆరంభ వేడుకలు
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి
స్పెషల్ ఎట్రాక్షన్‌గా విజయ్ దేవరకొండ
అలరించిన తమన్ మ్యూజికల్ నైట్
హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ యువక్రికెటర్లను ప్రోత్సహించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ అట్టహాసం ప్రారంభ మైంది. ఆరంభ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అలాగే టీమిండియా స్టార్ బౌలర్ మ హ్మద్ సిరాజ్, మాజీ క్రికెట్ అంబటి రాయు డు, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చా ముండేశ్వర్ నాథ్, టీజీ20 లీగ్ బ్రాండ్ అం బాసిడర్ విజయ్ దేవరకొండ హాజరయ్యా రు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేక ప్రదర్శన ఆరంభ వేడుకల్లో ఆద్యంతం ఆకట్టుకుంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ గల క్రికెటర్లను వెలికితీసి ప్రపంచానికి పరిచ యం చేయడమే లక్ష్యంగా ఈ లీగ్ తీసుకురావడం మంచి పరిణామమనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున టోర్నీ నిర్వాహకులను అ భినందించారు. టీజీ- 20లో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందని లీగ్ బ్రాండ్ అంబాసిడర్, హీరో విజయ దేవరకొండ వ్యాఖ్యానించాడు. ఈ లీగ్‌తో తెలం గాణ నుంచి మరింత మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారన్నాడు.






