గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి జూన్ 21: గ్రామీణ ప్రాంత యువతి యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో 50 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ ఎస్త్స్ర, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడిన ఆయన, వారికి అందుతున్న బోధనా విధానం, శారీరక శిక్షణ, పరీక్షల సన్నద్ధత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగ సాధన కోసం చేస్తున్న శ్రమ తప్పకుండా ఫలిస్తుందని భరోసా కల్పించారు.
గ్రామీణ ప్రాంతాల యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలరని అన్నారు. పోలీస్ నియామక పరీక్షల్లో విజయం సాధించేందుకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా ఎంతో అవసరమని సూచించారు. ప్రతిరోజూ స్పష్టమైన లక్ష్యంతో సాధన చేస్తూ, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో భాషా నైపుణ్యాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించి యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెవెల్లడించార. కార్యక్రమంలో అధ్యాపకుల బృందంతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీపతి, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






