24-05-2025 01:07:31 AM
-నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన
-హాజరైన రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి
తూప్రాన్, మే 23: తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ జాతర వేడుకలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు, కొనాయిపల్లి దేవాలయ ప్రాంగణం మిరుమిట్లు గొలిపే కాంతులతో విరాజిల్లుతూ చూపరులను ఆకర్షణకు కలగజేస్తుంది.
ఇందులో భాగంగా శుక్రవారం నాడు పండితుల మంత్రోచ్ఛరణతో గజస్తంభ ప్రతిష్టాపన చేయడం జరిగింది, అనంతరం చిట్కుల మహిపాల్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని జరిపించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు, అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు, శనివారం అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ జాతర ఉత్సవాల్లో ముదిరాజ్ సంఘం సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతంచేశారు.