అల్ఫోర్స్‌లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ కార్నివల్
కొత్తపల్లి, ఆగస్టు 20 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ కార్నివల్ గురువారం ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్నివాల్ ను ప్రారంభించి మాట్లాడారు. గ్రాండ్ పేరెంట్స్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకునేటి ఉంటాయని, ప్రత్యేకంగా కుటుంబంలో వ్యవహరించే విధానం, లక్ష్యాలను సాధించే మార్గాలను తెలుసుకొని అవలంబించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ గ్రాండ్ పేరెంట్స్ ను ఆదర్శంగా తీసుకోవాలని, వారు తెలిపిన విషయాలను తూచ తప్పకుండా అమలుపరిచి అగ్రగామిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రాండ్ పేరెంట్స్ ప్రదర్శించిన పలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






