calender_icon.png 25 January, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తిరంగా యాత్ర

10-08-2024 01:22:52 AM

ఎల్బీనగర్, ఆగస్టు 9: ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్‌రెడ్డి నగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా అభియాన్‌ను ఘనంగా నిర్వహించారు. బీఎన్‌రెడ్డి ఆటోస్టాండ్ నుంచి వనస్థలిపురం రైతుబజార్ వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలనే హర్ ఘర్ తిరంగా అభియాన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నవజీవన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.