17 April, 2026 | 9:29 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

రాజన్న కోడెల కోసం పచ్చిగడ్డి సాగు చేయాలి

26-06-2025 12:36 AM
  1. కలెక్టర్ సందీప్కుమార్ ఝా 

తిప్పాపూర్ గోశాల ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల, జూన్ 25 (విజయక్రాంతి)/వేములవాడ టౌన్: వేములవాడ రాజన్న కోడెలకు దాణా కోసం పచ్చిగడ్డిని సాగు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సం దీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ గోశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. గోశాల ఆవరణ, కోడెలకు అందించే గడ్డిని పరిశీలించారు అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ..

గోశాల ఆవరణలో మట్టిని చదును చేయించాలని, నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోడలకు నిత్యం పచ్చిగడ్డి అందించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. వేములవాడ పరిధిలోని హనుమక్కపల్లిలో 22 ఎకరాలు, మర్రిపల్లిలో 40 ఎకరాలు, మూఢపల్లిలోని 20 ఎకరాలు మొత్తం 82 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చి గడ్డి పెంపకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డిని ఆదేశించారు.

గోశాలలో పనిచేసేందుకు ఇటీవల నియమించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఆలయంలోని పలు విభాగాల్లో ఈవో తనిఖీ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఆలయ ఈవో రాధాబాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయంలోని శానిటేషన్, సెంట్రల్ గోదాం, భక్తులకు ఉచితముగా వితరణ చేసే పులిహోర తయారీనిపరిశీలించారు.