calender_icon.png 23 July, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తెలంగాణ రైజింగ్--2047’ గొప్ప ఆలోచన

26-06-2025 12:36:38 AM

సీఎం రేవంత్‌కు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అభినందన

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ విజన్--2047 గొప్ప ఆ లోచన అని ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించా రు. ఈ మేరకు బుధవారం యూకే మాజీ పీ ఎం నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ వచ్చిం ది. తెలంగాణ రైజింగ్ విజన్--2047లో నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, పెట్టబడుల సాధన, రైతులు, మహిళా, యువ సాధికారిత, మౌలిక వసతుల కల్పన, ఐటీ, ఇతర రంగాల అభివృద్ధి లక్ష్యాలను, చేరుకునే మార్గాలను టోనీ బ్లెయిర్ ఎంతో ప్రశంసించారు.

తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు సంబంధించి ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ (టీబీఐజీసీ), తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కలిసి పనిచేస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047లోని స్పష్టత, నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నా యంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

లక్ష్యాల సాధనకు ఇండియాలోని టీబీఐజీసీ ప్రతినిధి వివేక్ అగర్వాల్ తెలంగాణ ప్రభత్వానికి సహకరిస్తారని తెలిపారు. సీఎంవోకు ఏవైనా సందేహాలు ఉంటే తమ టీబీఐజీసీ భారత ప్రతినిధిని సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. తెలంగాణ రైజిం గ్ విజన్--2047 డాక్యుమెంట్ ఆవిష్కరణకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికి టోనీబ్లెయిర్ తెలియజేశారు. టీబీఐ జీసీ తరఫున ఇంగ్లండ్ మాజీ ప్రధాని చొరవ కారణంగా భవిష్యత్తులో రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.