calender_icon.png 18 December, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో డిస్కంకు పచ్చజెండా!

18-12-2025 12:54:48 AM

  1. మార్గదర్శకాలు జారీచేసిన విద్యుత్తు శాఖ

2026 ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కం ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటు కు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభు త్వ (విద్యుత్తు శాఖ) ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్‌మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశా రు. ఆర్థిక వనరులను సేకరించడానికి ప్రస్తు త డిస్కంల పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో పాటు.. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్‌డీఎస్‌ఎస్) లాంటి అభివృద్థి పథకాలను ప కడ్బందీగా అమలు చేయడానికి ప్రభు త్వం పచ్చజెండా ఊపింది.

రెండు డిస్కంల పరిధిలోనివి..

ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల పరిధిలోని 29,08,138 వ్యవసాయ కనెక్షన్లు ఇ మూడో డిస్కం పరిధిలోకి తీసుకొస్తారు. వ్యవసాయానికి సంబంధించి న 5,22,479 వ్యవసాయ డీటీఆర్‌లను బదిలీ చేస్తారు. రూ. 2137 కోట్ల విలువైన 2.61 లక్షల కి.మీ పొడవైన ఎల్టీ లైన్లను మూడో డిస్కం పరిధిలోకి రానున్నాయి. మూడో డిస్కం పరిధిలో కి రానున్న డీటీఆర్‌లకు స్మార్ట్ మీటర్లను రూ.1306 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. 

మూడో డిస్కం నిర్వహణకు కావాల్సిన ఉద్యోగులను ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల నుంచి కేటాయించనున్నారు. అలాగే ఇప్పు డు ఉన్న రెం డు డిస్కంల పరిధిలో ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను (పీపీఏ), అలా గే రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్నికూడా మూడు డిస్కంలకు పంచనున్నారు. ఇందు కు గడిచిన ఐదేండ్లుగా వివిధ అంశాలను ఆధారంగా చేసుకోనున్నారు.  

ఆస్తులు, అప్పులు

రెండు డిస్కంల పరిధిలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన రూ. 2,2926 కోట్ల బకాయిలను మూడో డిస్కంకు బదలాయించనున్నారు. హైదరాబాద్ తాగునీటి వ్యవస్థ, మిషన్ భగీరథ, ఎంఏయూడీ, పంచాయతీరాజ్, ఇతర రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాల శాఖ లకు సంబంధించి రావాల్సిన బకాయిలన్నీ కలపుకుని  మొత్తం రూ. 35982 కోట్లను మూడో డిస్కంకు బదలాయించనున్నారు.

అలాగే సీజీఎస్, తెలంగాణ జెన్‌కో, సింగరేణి లాంటి ఇతర సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 26950 కోట్లను మూడో డిస్కంకు అంటగట్టనున్నారు. దీనితోపాటు ఇప్పటికే వర్కింగ్ క్యాపిటల్‌గా తీసుకున్న రూ.9032 కోట్ల రుణాలనూ  మూడో డిస్కంకు అప్పజెప్పనున్నారు. ఇలా మూడో డిస్కం ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు మొత్తాన్ని 2026 ఏప్రిల్ 1 లోపు పూర్తి చేయాలని, దీనివల్ల ఏప్రిల్ 1 నుంచి కమర్షియల్‌గా మూడో డిస్కం నిర్వహణ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.